ముగిసిన అచ్చెన్నాయుడి రెండో రోజు ఏసీబీ విచారణ

  • ఐదు గంటల సేపు విచారించిన అధికారులు
  • లాయర్ హరిబాబు, డాక్టర్ సమక్షంలో విచారణ
  • విచారణకు ముందు పరీక్షలు నిర్వహించిన వైద్యులు
ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడి రెండో రోజు విచారణ ముగిసింది. గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. తొలి రోజు మూడు గంటల విచారణ జరిపిన అధికారులు... ఈరోజు  ఐదు గంటల సేపు విచారించారు. ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి నేతృత్వంతో విచారణ జరిగింది.

అచ్చెన్న తరపు లాయర్ హరిబాబు, డాక్టర్ సమక్షంలో విచారించారు. విచారణకు ముందు అచ్చెన్నకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ చేసిన తర్వాత ప్రత్యేక వార్డుకు తరలించి, అక్కడ విచారించారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేశారు.


More Telugu News