ఏపీకి రాజకీయంగా నాలుగు గ్రహణాలు పట్టాయి: జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రాష్ట్రంలో కుల పోరాటాలు జరుగుతున్నాయన్న జీవీఎల్
- ప్రజల భాగస్వామ్యం కనిపించడంలేదని వ్యాఖ్యలు
- ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెడతారా అంటూ ఆగ్రహం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ పరిణామాలపై స్పందించారు. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అవినీతిపై పోరాడతామన్న వైసీపీ, అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలేవీ లేవని విమర్శించారు. అవినీతి నిర్మూలన అంశాన్ని రాజకీయపరంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఏదని అన్నారు. కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా నాలుగు గ్రహణాలు పట్టాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చంద్రన్న, వైఎస్సార్, జగనన్న... వీళ్లేనా మహానాయకులు? అంటూ మండిపడ్డారు. దేశం కోసం ప్రకాశం పంతులు, వీరేశలింగం వంటి వారు దేనికైనా సిద్ధపడ్డారని, ఇలాంటి వాళ్లు కనిపించరా..? అని నిలదీశారు.