అమెరికాలో 2 కోట్ల మందికి కరోనా సోకి ఉండచ్చు!: యూఎస్ వైద్యాధికారుల అంచనా

  • అమెరికాలో ఇప్పటి వరకు 23 లక్షల కేసులు
  • పదింతలు ఎక్కువగా ఉంటుందంటున్న వైద్యులు
  • ప్రతి కేసు నుంచి మరో 10 మందికి సోకి ఉంటుందని అంచనా
అమెరికాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 23 లక్షల కేసులు నమోదయ్యాయనేది అధికారికంగా వెలువడిన ప్రకటన. అయితే, దీనికి పదింతలు ఎక్కువగా అంటే దాదాపు 2 కోట్ల మందికి కరోనా మహమ్మారి సోకి ఉంటుందనే ఆందోళనను ఆ దేశ వైద్యాధికారులు వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఇప్పటికే అనేక మంది వైరస్ బారిన పడ్డారని, పెద్ద సంఖ్యలో దాని బారిన పడబోతున్నారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ అన్నారు. ప్రతి కరోనా కేసుకు అదనంగా మరో 10 మందికి ఈ వైరస్ సోకి ఉంటుందని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ తెలిపారు. కరోనా సోకిన వారిలో 25 శాతం మందికి వ్యాధి లక్షణాలే లేవని చెప్పారు.


More Telugu News