ఆస్తుల వేలం సమాచారాన్ని లీక్ చేశారంటూ.. టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిపై వేటు

  • ఇటీవల టీటీడీ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైన టీటీడీ
  • ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు
  • దేవేందర్ రెడ్డి సమాచారం లీక్ చేశారని గుర్తించిన టీటీడీ అధికారులు
టీటీడీ ఎస్టేట్ అధికారి దేవేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమల వెంకన్నకు చెందిన నిరర్థక ఆస్తులను వేలం వేసేందుకు టీటీడీ సిద్ధమైన సంగతి తెలిసిందే. అ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, వేలం ప్రక్రియను టీటీడీ రద్దు చేసుకుంది. అయితే, వేలానికి సంబంధించిన సమాచారాన్ని దేవేందర్ రెడ్డి లీక్ చేశారని టీటీడీ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు. నివేదిక ఆధారంగా దేవేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు జేఎస్వీ ప్రసాద్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ స్థిరాస్తులను ఎస్టేట్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ కలిగిన దేవేందర్ రెడ్డి ఎస్టేట్ అధికారిగా ఉన్నారు. ఆయన వల్లే ఆస్తుల వేలం సమాచారం లీక్ అయిందని అధికారులు గుర్తించారు.


More Telugu News