ఆగస్టులో జైలు నుంచి శశికళ విడుదల? వేడెక్కుతున్న తమిళనాడు రాజకీయాలు!
- ఆగస్ట్ 14న శశికళ విడుదలవుతున్నారంటూ బీజేపీ నేత ట్వీట్
- అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశి
- తమిళ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవంటున్న విశ్లేషకులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. రానున్న ఆగస్ట్ 14వ తేదీన జైలు నుంచి ఆమె విడుదల కాబోతోందంటూ తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం చేసిన ట్వీట్ రాజకీయ వేడిని పుట్టిస్తోంది.
2016లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కొన్న నెలలకే జయలలిత అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత శశికళ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ, పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ సహా ఇరవళసి, సుధాకరన్ లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు శశికళ జైలు నుంచి విడుదలైతే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఆమె విడుదలవుతారనే విషయం ఎంత వరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉంది.