బెంగళూరులో పూర్తి లాక్ డౌన్ విధించబోతున్నారనే వార్తలపై సీఎం యడియూరప్ప స్పందన
- ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ముఖ్యం
- లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు
- అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి
బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. నగరంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో... మరోసారి పూర్తి లాక్ డౌన్ ను విధించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ విధిస్తామంటూ ఆరోగ్యమంత్రి శ్రీరాములు కూడా గత వారంలో కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలో, యడ్డీ స్పందిస్తూ లాక్ డౌన్ విధించబోమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. మరో లాక్ డౌన్ వద్దనుకుంటున్న ప్రజలంతా కరోనా నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని హితవు పలికారు.
అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులతో తాము మాట్లాడుతూనే ఉన్నామని... కరోనా రక్కసిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి అందరూ సహకరిస్తున్నారని యడ్డీ చెప్పారు. తమతమ నియోజకవర్గాల్లో కరోనాను కట్టడి చేసేందుకు ఎమ్మెల్యేలంతా శాయశక్తులా కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల వరకే లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు.