ఇది భారతీయ మహిళ స్వభావం కాదు: రేప్ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • రాత్రి 11 గంటలకు ఆఫీసుకు వెళ్లడం
  • నిందితుడితో మందు తాగి అక్కడే గడపడం
  • ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి
అత్యాచారానికి గురయ్యానంటూ కేసు వేసిన ఓ యువతిపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే... తన సహోద్యోగి తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా కేసు పెట్టిన యువతిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలసిపోయానని,  దాంతో నిద్రప్యానని బాధితురాలు చెప్పింది. ఇది చాలా దారుణం. భారతీయ మహిళ స్వభావం ఇది కాదు. రాత్రి 11 గంటలకు ఆఫీసుకు వెళ్లడం, నిందితుడితో కలిసి మందు తాగడం, రాత్రంతా అక్కడే గడపడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. వీటికి సంబంధించి ఆమె చెపుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇవ్వడానికి జైళ్లలో కరోనా వ్యాప్తిని కూడా కారణంగా చూపింది.


More Telugu News