కరోనా కట్టడి చర్యల విషయంలో ఏపీ సర్కారుకు యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు!
- కరోనా పరీక్షల్లో అగ్రగామిగా ఉందంటూ కితాబు
- బలమైన వలంటీర్ వ్యవస్థ అంటూ వ్యాఖ్యలు
- ఆంగ్ల మీడియా కథనాన్ని పంచుకున్న ఆండ్రూ ఫ్లెమింగ్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ హైదరాబాదులో యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అభినందించారు. ఇప్పటివరకు ప్రతి 10 లక్షల మందిలో 14,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, 4.5 లక్షల మందితో కూడిన బలమైన వలంటీర్ల వ్యవస్థ, 11,158 మంది గ్రామ కార్యదర్శులు, క్వారంటైన్ చర్యల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న వైనం అమోఘం అని కొనియాడారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకోవాలంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థలో సీఎం జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న తీరును ప్రస్తుతిస్తూ కథనం రాగా, ఆ కథనం లింకును కూడా ఫ్లెమింగ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.