కరోనా కలకలం... గుంటూరు మిర్చి యార్డు మూసివేత!
- ముగ్గురు వ్యాపారులకు సోకిన కరోనా
- యార్డు మొత్తం శానిటైజేషన్
- వ్యాపారులను కలిసిన వారిని గుర్తిస్తున్న అధికారులు
దాదాపు దక్షిణాది మొత్తానికి మిర్చిని పంపించే గుంటూరు మిర్చి యార్డులో కరోనా మహమ్మారి చెలరేగింది. యార్డులో వ్యాపారం నిర్వహించే ముగ్గురికి వైరస్ సోకడంతో యార్డును మూసివేశారు. ఇక్కడికి నిత్యమూ వందల సంఖ్యలో రైతులు తమ మిర్చి పంటను తెచ్చి అమ్ముతుంటారు.
ఇక యార్డులో వ్యాపారులకు కరోనా సోకడంతో, వారు వ్యాపారం నిర్వహించే ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. శని, ఆదివారాలు ఎలానూ మార్కెట్ కు సెలవు కాబట్టి, తిరిగి సోమవారం నాడు పరిస్థితిని సమీక్షించి యార్డును తెరిపిస్తామని అధికారులు వ్యాఖ్యానించారు. ఈలోగా, యార్డు మొత్తాన్ని సోడియం హైపోక్లోరైడ్ తో శానిటైజ్ చేస్తున్నామని అన్నారు. వైరస్ సోకిన వ్యాపారుల వద్దకు వచ్చిన రైతులు, దళారీలు, కూలీలను గుర్తించి, వారిని తగు జాగ్రత్తలతో ఉండాలని సూచించినట్టు అధికారులు తెలిపారు.