అచ్చెన్నాయుడు పూర్తిగా సహకరించారు: ఏసీబీ అధికారులు
- అచ్చెన్నను మూడు రోజులు విచారించేందుకు అనుమతించిన కోర్టు
- ముగిసిన తొలి రోజు విచారణ
- మూడు గంటల సేపు కొనసాగిన విచారణ
ఈఎస్ఐ స్కామ్ కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన చికిత్స పొందుతున్న జీజీహెచ్ ఆసుపత్రిలోనే ఆయనను విచారించారు. దాదాపు మూడు గంటల సేపు విచారణ కొనసాగింది.
తొలిరోజు విచారణ ముగిసిందని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు తెలిపారు. విచారణకు అచ్చెన్నాయుడు సహకరించారని చెప్పారు. రేపు, ఎల్లుండి కూడా అచ్చెన్నను అధికారులు విచారించనున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఓ రహస్య ప్రదేశంలో విచారించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.