సుశాంత్ ఘటన అనంతరం 'ఆత్మహత్య'పై కదిలిన తారాలోకం
- ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం
- కౌన్సెలింగ్ కేంద్రాల ఫోన్ నెంబర్లను ట్విట్టర్ లో పంచుకుంటున్న తారలు
- ఒక్కొక్కరు ఇద్దర్ని నామినేట్ చేస్తూ చైతన్యం కలిగించే యత్నం
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అనేక భాషల చిత్ర పరిశ్రమలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు ప్రచారం మొదలుపెట్టారు. అమెరికా, భారత్ లో ఆత్మహత్యల నివారణ కేంద్రాల ఫోన్ నెంబర్లను తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకుంటున్నారు. ఆయా ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మాట్లాడితే కౌన్సెలింగ్ ఇస్తారని, తద్వారా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు తొలగిపోతాయని ప్రచారం చేస్తున్నారు.
ఈ అంశంపై దర్శకుడు దేవా కట్టా పోస్టు చేసి హీరో సాయితేజ్ ను నామినేట్ చేశాడు. సాయితేజ్ దీనిపై స్పందిస్తూ, తన వంతుగా వెన్నెల కిశోర్, లావణ్య త్రిపాఠిలను నామినేట్ చేశాడు. ఆపై లావణ్య త్రిపాఠి ఈ చాలెంజ్ ను స్వీకరిస్తూ, మన బాధలు వినేవాళ్లు ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు అంటూ పోస్ట్ చేశారు. ఈ చాలెంజ్ లో భాగంగా రీతూ వర్మ, రాహుల్ రవీంద్రన్ లను నామినేట్ చేశారు.