అమెరికా నిర్ణయంతో పెద్ద ఎత్తున కెనడా బాట పడుతున్న భారత టెక్కీలు.. రిక్రూట్ మెంట్ ఏజెన్సీలు ఫుల్ బిజీ!
- హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించిన అమెరికా
- వెల్ కమ్ అంటున్న కెనడా
- రెండేళ్లలో 10 లక్షల మందిని ఆకర్షించాలని టార్గెట్ పెట్టుకున్న కెనడా
ఈ ఏడాది చివరి వరకు హెచ్-1బీతో పాటు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో, అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయ టెక్ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ టెక్కీలు కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తీసుకుంటున్న పలు చర్యల నేపథ్యంలో, ఇప్పటికే ఎందరో భారతీయులు కెనడా బాట పట్టారు. తాజాగా వారి సంఖ్య మరింత పెరుగుతోంది.
ఉద్యోగాలకు సంబంధించి భారతీయుల నుంచి ఎంక్వైరీలు పెరిగాయని కెనడా రిక్రూట్ మెంట్ కంపెనీలు చెపుతున్నాయి. మాబ్ స్వ్కాడ్ సంస్థ సీఈవో ఇర్ఫాన్ రావ్జీ మాట్లాడుతూ, తమ వెబ్ సైట్ కు హిట్స్ పెరిగాయని, ఈమెయిల్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని... గత రెండు రోజుల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు. పెద్దపెద్ద టెక్ కంపెనీలకు మాబ్ స్క్వాడ్ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏర్పాటు చేస్తుంటుంది. ఉద్యోగులంతా కెనడా నుంచి పని చేస్తుంటారు.
వీసాలపై సస్పెన్షన్ విధిస్తున్నట్టు అమెరికా నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్కో మెండిసినో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో తమ పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ మెరుగుపరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంటర్ ప్రెన్యూర్స్, ఇంజినీర్స్, ఇన్నొవేటర్సన్ ను రప్పించడానికి తమ వద్ద వివిధ ప్లాన్లు ఉన్నాయని చెప్పారు.
2020 నుంచి 2022 మధ్య కాలంలో కనీసం 10 లక్షల మందిని ఆకర్షించాలని లాక్ డౌన్ కు ముందే కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికి 74 వేల మంది పీఆర్ (పర్మినెంట్ రెసిడెన్స్)ను సాధించగా... అందులో 24 శాతం మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం అధిక సంఖ్యలో భారతీయులు కెనడాకు వెళ్లడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.