కక్ష సాధించాలన్న వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది.. అందుకే ఇలాంటి చర్యలు: చినరాజప్ప
- అచ్చెన్నను బలవంతపు డిశ్చార్జి చేయించాలనుకున్నారు
- కుట్రలో భాగంగానే కక్ష సాధింపు
- కోర్టులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయి
- జగన్ వాటి తీర్పులను ధిక్కరిస్తున్నారు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును గత అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి చేయించాలని పోలీసులు ప్రయత్నించారంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అమరావతిలో టీడీపీ నేత చినరాజప్ప మాట్లాడుతూ... అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జి చేయాలనుకున్నారని చెప్పారు.
కుట్రలో భాగంగానే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు. టీడీపీపై కక్ష సాధించాలన్న వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చినరాజప్ప విమర్శించారు. అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కోర్టులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంటే జగన్ వాటి తీర్పులను ధిక్కరించి వ్యవహరిస్తున్నారని తెలిపారు. 16 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనకు న్యాయస్థానాలు, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై గౌరవం లేదని చినరాజప్ప విమర్శించారు.