ఈ ప్రజావేదిక శిథిలాలే సాక్ష్యం చెబుతున్నాయి: మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్
- ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రజా వేదికను కూల్చేశారు
- ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి దానితో బీజం వేశారు
- జగన్‌రెడ్డి నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న పాలకుడు
- ప్రజావేదికని ఒక్క రాత్రిలో కూల్చేశారు జగన్‌రెడ్డి
తమ టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా దీనిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. 'ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రజా వేదికను కూల్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి దానితో బీజం వేశారు. ప్రజావేదికను కూల్చేయడం జగన్ పాలనకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను, సంస్థను ఏడాది సమయంలోనే నాశనం చేశారు' అని చంద్రబాబు అన్నారు.
ఒక భవనం కట్టడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అయితే, కూలగొట్టడం చిటికెలో పని అని, తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఇది తెలిసి కూడా విధ్వంసానికే జైకొడుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రజావేదికను కూల్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా లోకేశ్ ట్వీట్లు చేశారు.
'చంద్రబాబు అంటే నవ్యాంధ్ర నిర్మాత, జగన్‌రెడ్డి అంటే నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని ప్రజావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావేదికని కడితే, ఒక్క రాత్రిలో కూల్చేశారు జగన్‌రెడ్డి' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.