కరోనా నుంచి కోలుకున్న హృద్రోగుల్లో మళ్లీ తిరగబెట్టే ప్రమాదం

  • చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
  • కోలుకున్న తర్వాత కూడా శరీరంలో వైరస్ ఆర్ఎన్ఏ
  • ఊపిరితిత్తుల అంతర భాగాల్లోనూ వైరస్
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న హృద్రోగులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఇది కొంచెం కలవరం కలిగించే వార్తే. మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందని చైనాలోని హుహాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. వుహాన్‌లోని కేంద్ర ఆసుపత్రిలో 938 మంది కోవిడ్ రోగుల వివరాలను పరీక్షించిన అనంతరం అధ్యయనకారులు ఈ నిర్ణయానికి వచ్చారు.

అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలతో బాధపడుతూ కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారిలో 58 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. డిశ్చార్జ్ అయిన తర్వాత 44 రోజుల వరకు వైరస్ ఆర్ఎన్ఏ వారి శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. అలాగే కొందరి ఊపిరితిత్తుల అంతర భాగాల్లోనూ వైరస్ ఉండడాన్ని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.


More Telugu News