తిరుపతిలో ఓ ఇంటిలో చోరీ.. రూ.14 లక్షల సొత్తు అపహరణ
- గాయత్రినగర్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు
- రూ. 10.70 లక్షల విలువైన బంగారం, రూ. 3.75 లక్షల నగదు చోరీ
- మధ్యాహ్నం వరకు గుర్తించలేకపోయిన యజమాని
తిరుపతిలోని గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది. తలుపులు తొలగించి ఇంట్లోకి చొరబడిన ముఠా రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షల నగదును దోచుకుంది. చోరీ జరిగినట్టు సాయంత్రం వరకు యజమాని గుర్తించకపోవడం గమనార్హం. ఆ తర్వాత తెలుసుకుని లబోదిబోమన్నాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.