రఘురామకృష్ణంరాజుకు నోటీసు ఇవ్వడానికి కారణం ఇదే: విజయసాయిరెడ్డి

  • పార్టీ నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే
  • లేకపోతే ఎంత పెద్దవారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవు
  • జగన్ వల్లే రఘురామకృష్ణంరాజుకు పదవులు దక్కాయి
పార్టీ నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని... వాటిని ఉల్లంఘించిన వారు ఎంత పెద్ద వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి చెప్పారు. రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతున్న వ్యాఖ్యలు పార్టీకి విరుద్ధంగా ఉంటున్నాయని తెలిపారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఎంతో గౌరవం ఇచ్చారని... ఇతర ఎంపీల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. జగన్ వల్లే ఆయనకు పదవులు లభించాయని అన్నారు. అయినా, పార్టీ నిబంధనలకు  ఆయన కట్టుబడలేదని... నియమాలను పాటించకపోవడం వల్లే ఆయనకు నోటీసులు  ఇచ్చామని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే నిమ్మగడ్డ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విజయసాయి ఆరోపించారు. పార్క్ హయత్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డీజీపీకి లేఖ రాశామని చెప్పారు. సుజనా చౌదరితో నిమ్మగడ్డకు ఏం పని ఉందని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏ వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అడిగారు.


More Telugu News