గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌పై తొలిసారి స్పందిస్తూ ప్రకటన చేసిన చైనా ఆర్మీ

  • చైనా వైపున ఉన్న భూభాగంలో ఘ‌ర్ష‌ణ జ‌రిగింది
  • భార‌త సైనికులే నియంత్రణ రేఖ‌ను దాటి వచ్చారు
  • స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిర‌త్వం ఉండాలని కోరుకుంటున్నాం
  • ఘర్షణ ఘ‌ట‌న మమ్మల్ని షాక్‌కు గురి చేసింది
ఈ నెల 15న తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లోయ వద్ద భారత్-చైనా సైనికులు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ తొలిసారి ఈ రోజు ఓ ప్రకటన చేసింది.  చైనా వైపున ఉన్న భూభాగంలో ఆ ఘ‌ర్ష‌ణ జ‌రిగిందని చెప్పుకొచ్చింది. భార‌త సైనికులే నియంత్రణ రేఖ‌ను దాటి వచ్చారని, ఈ ఘర్షణకు భారత్‌ బాధ్య‌త వహించాలని వ్యాఖ్యానించింది.

కాగా, చైనా ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌తినిధి వూ కియాన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిర‌త్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య కుదిరిన ఒప్పందాన్ని భార‌త సైన్యం ఉల్లంఘించిందని చెప్పుకొచ్చారు. ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల‌కు చెందిన ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్నారని తెలిపారు. ఈ నెల 15న ఘర్షణ జరిగిన ఘ‌ట‌న తమను షాక్‌కు గురి చేసింద‌ని చెప్పారు.


More Telugu News