అసలు వాళ్లు ముగ్గురు గోప్యంగా కలవాల్సిన రాచకార్యాలు ఏమున్నాయి?: విజయసాయిరెడ్డి
- వారిపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
- కుల మీడియా ఆవేదన మాత్రం మరోలా ఉంది
- సీసీ కెమెరా ఫుటేజీ బయటకెలా వచ్చిందంటోంది
- కడివెడు నీళ్లు కార్చింది
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి పార్క్ హయాత్‌లో రహస్యంగా కలిశారంటూ వీడియో ఫుటేజ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ విషయంపై విజయసాయిరెడ్డి స్పందించారు.
'అసలు వాళ్లు ముగ్గురు గోప్యంగా కలవాల్సిన రాచకార్యాలు ఏమున్నాయని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, కుల మీడియా ఆవేదన మరోలా ఉంది. సీసీ కెమెరా ఫుటేజీ బయటకెలా వచ్చిందని గుండెలు బాదుకుంది. వీఐపీలు, సెలబ్రటీలు వెళ్లే చోట ఇంత ఆషామాషీగా ఉంటే ఎలా అని కడివెడు నీళ్లు కార్చింది' అని విమర్శలు గుప్పించారు.