ప్రజాస్వామ్య నియంతలా జగన్‌.. అటువంటి వారి కట్టడికి 'మండలి' ఉండాలి: యనమల

  • ఏపీలో అరాచక పాలన
  • కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలి
  • శాసన మండలి శాశ్వత సభగా ఉండాలి
  • ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఎగువ సభలు ముఖ్యం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శాసన మండలి రద్దు విషయంలో జగన్‌ చేస్తోన్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. ఏపీలో కొనసాగుతోన్న అరాచక పాలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నియంతల నియంత్రణకు శాసన మండలి శాశ్వత సభగా ఉండాలన్నారు.

ప్రజాస్వామ్య నియంతలా జగన్‌ మారారని, అటువంటి వారి కట్టడికి మండలి ఉండాలని చెప్పారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఎగువ సభలు ముఖ్యమని తెలిపారు. రాజ్యసభ శాశ్వత సభగా ఉందని గుర్తు చేసిన ఆయన.. శాసన మండలి కూడా శాశ్వత సభలా ఉండాల్సిందేనని చెప్పారు. ఈ మేరకు కేంద్ర సర్కారు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు 3 రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లులను శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపిందని, అయితే, ఏపీ సర్కారు దీనికి భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 


More Telugu News