మహమ్మారి వేగం... ఒక్కరోజులో 16 వేల కేసులు, 465 మంది మృత్యువాత!
- మంగళవారం నమోదైన కొత్త కేసులు 15,968
- 4.56 లక్షలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
- నిన్న 2,15,195 మందికి కరోనా పరీక్షలు
- వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలోనే 15,968 కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం 4,56,183 కేసులు వచ్చినట్లయింది. ఇదే సమయంలో నిన్న 465 మంది పరిస్థితి విషమించి మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు పెరిగింది.
ఇక కరోనా వైరస్ సోకిన వారిలో 2.58 లక్షల మంది ఇంతవరకూ రికవర్ అయ్యారని, రికవరీ రేటు 56.7 శాతానికి చేరుకుందని కేంద్రం పేర్కొంది. మంగళవారం నాడు 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఒకరోజులో చేసిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదేనని పేర్కొన్న ఆరోగ్య శాఖ, ఇంతవరకూ 73,52,911లక్షలకు పైగా టెస్ట్ లను చేశామని వెల్లడించింది. యావరేజ్ పాజిటివ్ రేటు 7.42 శాతమని తెలిపింది.