తెలంగాణ, ఏపీల మధ్య బస్సులు ఇప్పట్లో లేనట్టే!
- నేడు జరగాల్సిన ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
- అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
- కరోనా కేసులు పెరగవచ్చన్న ఆలోచనతోనే వాయిదా
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. నేడు జరగాల్సిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల నిర్వహణపై చర్చించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో బస్సులు నడిపిస్తే కేసులు మరింతగా పెరగవచ్చన్న ఆలోచనతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు.
కాగా, అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్యా బస్సులను నడిపించే విషయమై గతంలోనే ఓ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు తమతమ రాష్ట్రాల పరిధిలో మాత్రమే బస్సులు నడుపుతున్నాయి. తాజా సమావేశం వాయిదా పడటంతో బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ఎదురుచూసిన తెలుగు ప్రజలకు నిరాశే మిగిలింది.