మహారాష్ట్రలో 70 మంది కరోనా రోగుల అదృశ్యం
- తప్పుడు ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇచ్చిన వైనం
- అందరూ మురికివాడలకు చెందిన వారే
- వారెక్కడికీ పారిపోయి ఉండరన్న మంత్రి
మహారాష్ట్రలో కోవిడ్ సోకిన 70 మంది ఆచూకీ తెలియరావడం లేదు. పరీక్షల సమయంలో ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాను తప్పుగా ఇవ్వడం వల్ల వారిని గుర్తించడం కష్టమవుతోందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సాయం కోరింది. అదృశ్యమైన వారందరూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మలాడ్ కు చెందిన వారని అధికారులు గుర్తించారు.
వారెక్కడికీ పారిపోయి ఉండరని, వారి ఫోన్ నంబర్లు, చిరునామాను నమోదు చేసుకునే క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని మంత్రి అస్లామ్ షేక్ తెలిపారు. వారు తమ చిరునామాల్లో పేర్కొన్న చాలా ప్రాంతాలు మురికివాడలకు చెందినవేనని, వారిలో కొందరు వలస కార్మికులు కూడా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇంకొందరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయి కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, తప్పిపోయిన రోగుల జాబితాను బీఎంసీ తమకు అందించినట్టు డిప్యూటీ కమిషనర్ ప్రణయ్ అశోక్ తెలిపారు.