కరోనా సోకిందని తెలియగానే మినీ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
- కర్ణాటకలో ఘటన
- ఆసుపత్రికి వెళ్లేలోపే లుంగీతో ఉరేసుకున్న రిజర్వ్ పోలీసు
- కరోనాకు భయపడవద్దన్న అడిషనల్ డీజీపీ
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో అతడిని బెంగళూరులోని సీవీ రామన్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా ఓ మినీ బస్సు ఏర్పాటు చేశారు.
కానీ ఆ బస్సు ఆసుపత్రికి చేరేలోపే ఆ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న అనంతరం బస్సు డోర్ తీయగా, ఆయన తన లుంగీతో బస్సు గ్రిల్ కు ఉరేసుకుని కనిపించాడు. కరోనా పాజిటివ్ గా వచ్చిందన్న భయంతోనే ఆ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కరోనా పాజిటివ్ గా వచ్చినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని, దానిపై విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంటే తప్పకుండా కోలుకుంటారని కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీస్ విభాగం అడిషనల్ డీజీపీ అలోక్ కుమార్ స్పష్టం చేశారు.