విజయవాడలో వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్... కలెక్టర్ ఆదేశాలు
- కృష్ణా జిల్లాలో కరోనా విలయం
- విజయవాడ నగరంలో వందల సంఖ్యలో కేసులు
- ఎల్లుండి లోపు నిత్యావసరాలు సమకూర్చుకోవాలన్న జిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. విజయవాడ నగరంలో వందల సంఖ్యలో కరోనా బాధితులు ఉండడంతో ఇప్పుడక్కడ మరోసారి లాక్ డౌన్ కు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు.
నగర ప్రజలు ఎల్లుండి లోపు నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో నిత్యావసర దుకాణాలకు, మెడికల్ షాపులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. అత్యవసరం కాని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను వారం పాటు మూసివేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా ఆంక్షలు విధిస్తున్నామని, స్థానిక ఆర్డీవోలు పరిశీలించి ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.