బ్రిటన్ దివాలా అంచుకు చేరుకుంది: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్

  • కరోనా దెబ్బకు బ్రిటన్ అతలాకుతలమైంది
  • ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి
  • దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది
ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్ దివాలా అంచుకు చేరుకుందని ఆ దేశ కేంద్ర బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి దెబ్బకు బ్రిటన్ అతలాకుతలమైందని ఆయన అన్నారు. కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పుడు ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని... ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం తాత్కాలికం కాదని... ఇది దీర్ఘకాలం ఉంటుందని చెప్పారు.

మరోవైపు కరోనాతో నెలకొన్న సంక్షోభం నుంచి బ్రిటన్ ను గట్టెక్కించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటి వరకు మార్కెట్లోకి 200 బిలియన్ పౌండ్ల కరెన్సీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ బాండ్లను జారీ చేయడం ద్వారా బ్యాంకులకు నిధుల లోటు లేకుండా కూడా చేసింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం గమనార్హం. సాక్షాత్తు ఆ దేశ కేంద్ర బ్యాంకు గవర్నర్ దివాలాకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం అక్కడి పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.


More Telugu News