పార్క్ హయత్ హోటల్ ఓ పబ్లిక్ ప్లేస్... దాన్ని రహస్య భేటీ అని ఎలా అంటారు?: రఘురామకృష్ణంరాజు
- పార్క్ హయత్ హోటల్లో రమేశ్ కుమార్, సుజనా, కామినేని భేటీ
- భేటీ సమయానికి రమేశ్ కుమార్ ఎస్ఈసీనా కాదా అనేది గమనించాలన్న ఎంపీ
- హోటల్లో వారి కలయికను తప్పుబట్టాల్సిన అవసరంలేదని వెల్లడి
హైదరాబాదులోని పార్క్ హయత్ స్టార్ హోటల్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రహస్య భేటీ అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.
పార్క్ హయత్ హోటల్ ఓ పబ్లిక్ ప్లేస్ అయినప్పుడు, అక్కడ జరిగిన భేటీ రహస్యం ఎలా అవుతుందని అన్నారు. ఈ భేటీ 13వ తేదీన జరిగిందని అంటున్నారని, అప్పటికి రమేశ్ కుమార్ ప్రభుత్వం దృష్టిలో ఎన్నికల సంఘం కమిషనరా? కాదా? అనేది గమనించాల్సిన అంశం అని తెలిపారు. ఒకవేళ రమేశ్ కుమార్ ఎస్ఈసీ పదవిలో ఉంటే మాత్రం హోటల్ కు వచ్చి సుజనా చౌదరిని కలవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అయితే, తమ ప్రభుత్వం ఆయనను ఎస్ఈసీగా గుర్తించని నేపథ్యంలో, హోటల్లో వారి కలయికను తప్పుబట్టడంలో అర్థంలేదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.