పీవీకి 'భారతరత్న' ఇవ్వాలని తీర్మానం చేసి స్వయంగా ప్రధాని మోదీకి అందిస్తా: సీఎం కేసీఆర్

  • పీవీ శతజయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ నిర్ణయం
  • పీవీకి భారతరత్నపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడి
  • ఉత్సవాల కోసం రూ.10 కోట్లు కేటాయింపు
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ఇప్పటికీ సముచిత గౌరవం దక్కడంలేదని అసంతృప్తికి గురయ్యేవారిలో సీఎం కేసీఆర్ కూడా ఒకరు. పీవీకి రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆయన చాలాసార్లు ప్రస్తావించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28న పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసి వేడుకలకు శ్రీకారం చుడతామని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాలను 50 దేశాల్లో నిర్వహిస్తామని, ఉత్సవాలకు రూ.10 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ  క్యాబినెట్ లోనూ, అసెంబ్లీలోనూ తీర్మానం చేసి స్వయంగా ప్రధాని మోదీకి అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


More Telugu News