డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులను పాస్ చేయాలి: పవన్ కల్యాణ్
- ఇటీవలే ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు
- ఇతర పరీక్షలపైనా నిర్ణయం తీసుకోవాలన్న పవన్
- ఒడిశా, మహారాష్ట్రల్లో డిగ్రీ పరీక్షలు రద్దు చేశారని వెల్లడి
ఏపీలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులను ఉత్తీర్ణులు అయినట్టు ప్రకటించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిగ్రీ ఫైనలియర్ పరీక్షలతో పాటు ఎంబీఏ, ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను కూడా రద్దు చేయాలని కోరారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏ విద్యార్థి పరీక్ష కేంద్రాలకు వెళ్లడం సాధ్యం కాదని, ఆరోగ్యరీత్యా ఎంతో ప్రమాదకరం అని పవన్ వివరించారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, ఈ విషయాన్ని మన రాష్ట్రంలోని యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుని తమ పరిధిలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలిపారు.