కరోనాకు పతంజలి మందు .. మార్కెట్లో విడుదల చేసిన రాందేవ్ బాబా!
- కోరోనిల్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల
- కృషి చేసిన శాస్త్రవేత్తలకు రామ్‌దేవ్ అభినందనలు
- ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది
- మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ
మానవాళిని వణికిస్తోన్న కరోనాకు పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాందేవ్ బాబా హరిద్వార్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. 'కోరోనిల్' పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును ఆయన విడుదల చేశారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని ఆయన చెప్పారు.
ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు.