హెచ్-1బీ వీసాలపై ట్రంప్ నిర్ణయంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందన
- అమెరికా సాధించిన విజయాల్లో ఇమ్మిగ్రేషన్ తోడ్పాటు
- అమెరికా సాంకేతికపరంగా గ్లోబల్ లీడర్‌గా అవతరించింది
- గూగుల్ గొప్ప స్థానంలో ఉందంటే ఇమ్మిగ్రేషన్ వల్లే
- ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహపరిచింది
కొవిడ్-19 వల్ల అమెరికాలో నిరుద్యోగ సమస్య తీవ్రతరమైన నేపథ్యంలో హెచ్-1బీ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందిస్తూ ఈ తీరు సరికాదని చెప్పారు. అమెరికా ఆర్థిక రంగంలో సాధించిన విజయాల్లో ఇమ్మిగ్రేషన్ ఎంతోగానో సహకరించిందని చెప్పారు.
అందువల్లే అమెరికా సాంకేతికపరంగా గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని తెలుపుతూ సుందర్ పిచాయి ట్వీట్ చేశారు. గూగుల్ ఇప్పుడు గొప్ప స్థానంలో ఉందంటే అది కూడా ఇమ్మిగ్రేషన్ వల్లేనని చెప్పారు. ట్రంప్ చేసిన ప్రకటన తమను నిరుత్సాహపరిచిందని తెలిపారు. అయినప్పటికీ, తాము ఇమ్మిగ్రాంట్లను ప్రోత్సహిస్తూనే ఉంటామని, అందరికీ అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని ప్రకటించారు.