కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి సుధాకర్ భార్య, కుమార్తెకు కరోనా
- స్వయంగా వెల్లడించిన మంత్రి సుధాకర్
- ఆయన తండ్రికి సోకిన మరునాడే భార్య, కుమార్తెకు
- ఇద్దరు కుమారులకు నెగటివ్ వచ్చిందన్న మంత్రి
దేశంలో వైరస్ బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, తాజాగా కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి కె.సుధాకర్ భార్య, ఆయన కుమార్తె కోవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. తన భార్య, కుమార్తెకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. కాగా, మంత్రి తండ్రి పీఎన్ కేశవరెడ్డికి కరోనా సోకినట్టు నిన్న నిర్ధారణ అయింది.
దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు నిర్వహించిన పరీక్షలో కరోనా సోకినట్టు తేలింది. కాగా, తన భార్య, కుమార్తె ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పిన మంత్రి, తన ఇద్దరు కుమారులకు మాత్రం నెగటివ్ వచ్చినట్టు చెప్పారు. కాగా, కోవిడ్-19 సోకిన జర్నలిస్టును కలిసిన మంత్రి సుధాకర్, మరో ముగ్గురు మంత్రులు ఏప్రిల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.