బెంగళూరులో భార్యను చంపి.. కోల్‌కతాకు వెళ్లి అత్తను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!
- బెంగళూరులో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అగర్వాల్
- భార్యతో విభేదాలతో హత్య
- అత్తను చంపిన అనంతరం ఆత్మహత్య లేఖ
బెంగళూరులో తన భార్యను చంపిన ఓ వ్యక్తి అనంతరం అక్కడి నుంచి కోల్‌కతాకు వెళ్లి అత్తను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు వివరాలు తెలిపారు. అమిత్ అగర్వాల్ అనే వ్యక్తి బెంగళూరులో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.
అతడికి కొన్నేళ్ల క్రితం శిల్పి ధంధనియాతో వివాహం జరిగింది. వారికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, ఆ దంపతులు విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భార్య ఉంటోన్న ఇంట్లో ఆమెను హత్య చేశాడు. అనంతరం విమానంలో కోల్‌కతాలోని ఫూల్‌బాగన్ ప్రాంతంలో తమ అత్త, మామలు ఉంటోన్న ఫ్లాట్‌కు వెళ్లాడు.. అక్కడ వారిద్దరితో గొడవపడ్డాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అగర్వాల్ తుపాకీ తీసి తన అత్త లలితపై కాల్పులు జరిపాడు. అగర్వాల్ మామయ్య సుభాశ్ (70) ఫ్లాట్ బయటకు పరుగులు తీసి బయటి నుంచి గడియ పెట్టి, ఇంటి పక్క వారిని సాయం కోరాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ ఫ్లాట్‌లో అత్తను చంపిన అనంతరం అగర్వాల్ కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, ఆత్మహత్య లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. తన భార్యను కూడా చంపేశానని అగర్వాల్ ఆత్మహత్య లేఖలో రాయడంతో బెంగళూరులోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆమె ఇంటికి వెళ్లగా శిల్పి మృతదేహం లభ్యమైంది.