తమిళ, మలయాళ సినీ నటి ఉషారాణి కన్నుమూత

  • కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఉషారాణి
  •  200కు పైగా తమిళ, మలయాళ సినిమాల్లో నటన
  • 2004లో చివరిసారి మైలాటం సినిమాలో నటించిన ఉషారాణి
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళ, మలయాళ సీనియర్ సినీ నటి ఉషారాణి (65) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం కన్నుమూశారు. తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. మలయాళ దర్శకుడు, దివంగత శంకర్ నాయర్‌ ఆమె భర్తే. 1971లో నాయర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. దాదాపు 200కుపైగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు.

అరంగేట్రం, ఎన్నై పోల్ ఒరువన్, మన్నవ, పాత్రమ్, హిట్లర్, స్వర్ణ కిరీడం, మలయేథుమ్ మున్పె, కన్మదం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఉషారాణి టీవీ సిరియళ్లలోనూ నటించారు. 2004లో చివరిసారి మైలాటం అనే సినిమాలో కనిపించారు. పోరూర్ శ్మశాన వాటికలో అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఉషారాణి మృతికి పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, జయసూర్య వంటి మాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.


More Telugu News