గాల్వన్ లోయ ఘర్షణలతో ఈ దేశీయ యాప్ కు విశేష ఆదరణ!
- భారత్ లో చైనా వస్తువుల వ్యతిరేక ఉద్యమం
- టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా చింగారీ యాప్
- 72 గంటల వ్యవధిలో 5 లక్షల డౌన్ లోడ్లు
ఇటీవల చైనా బలగాలతో భారత సైనికులు గాల్వన్ లోయలో వీరోచిత పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత తీవ్రమైంది. చైనా వస్తు బహిష్కరణ ఓ ఉద్యమంలా రాజుకుంటోంది. ముఖ్యంగా, టిక్ టాక్ వంటి చైనా యాప్ లపైనా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, చింగారీ అనే దేశీయ యాప్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఆ యాప్ సృష్టికర్తలు చెబుతున్నారు.
జూన్ 10 నాటికి లక్ష డౌన్ లోడ్లు సాధించిన ఈ యాప్... గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేవలం మూడ్రోజుల వ్యవధిలో 5 లక్షల డౌన్ లోడ్లు సాధించిందని యాప్ రూపకర్తలు సిద్ధార్థ్, బిశ్వాత్మ తెలిపారు. టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ట్రెండింగ్ లో ఉందని వెల్లడించారు. చింగారీ యాప్ లో వ్యూస్ ఆధారంగా వీడియోలపై యూజర్లు డబ్బు సంపాదించుకోవచ్చని సిద్ధార్థ్, బిశ్వాత్మ చెబుతున్నారు.