తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్ పై హైకోర్టులో విచారణ ఈ నెల 26కి వాయిదా
- అరెస్ట్ లపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేతలు
- కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- కాంగ్రెస్ నేతలు కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న ప్రభుత్వం
ప్రాజెక్టుల సందర్శనకు సిద్ధమైన తమను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. గత శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు డీజీ రాజీవ్ రతన్ కోర్టులో కౌంటర్ వేశారు.
కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ నేతలు భారీ జనసమీకరణకు పిలుపునిచ్చారని, కరోనా కట్టడికి కేంద్ర హోంశాఖ ప్రకటించిన మార్గదర్శకాలు అమలు చేసే బాధ్యత పోలీసులకు ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే, ఎంపీలు, ఎమ్మెల్యేల హక్కులకు ఎలాంటి విఘాతం కలిగించలేదని కోర్టుకు తెలిపారు. అటు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జలదీక్షకు పిలుపునిచ్చిందని, ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వం తరఫు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.