సుప్రీంకోర్టు అనుమతి.. కదలనున్న పూరీ జగన్నాథుడి రథ చక్రాలు!
- పూరీ రథయాత్రకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- భక్తులు లేకుండా నిర్వహించాలంటూ ఆదేశం
- కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే పూరీ జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రథయాత్రకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ యాత్రలో భక్తులు పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రథయాత్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరుపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదిస్తూ... రథయాత్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో రేపటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్రను నిర్వహించనున్నారు.