కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తరలింపు
- ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ముగిసిన పోలీసు కస్టడీ
- కొనసాగుతున్న 14 రోజుల రిమాండ్
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అనంతపురం నుంచి కడప జైలుకు తరలించారు. పోలీసు కస్టడీ ముగియడంతో ఇద్దరినీ ఈరోజు అనంతపురం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో, వీరిని జైలుకు పంపిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిందే. ఇంకా రిమాండ్ కాలం కొనసాగుతోంది.
మరోవైపు అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తమను అక్రమంగా ఇరికించారని ఏపీ హైకోర్టులో ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఉమ, కుమారుడు అస్మిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, కేసులో తదుపరి చర్యలను నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.