16 రోజుల్లో లీటరుకు రూ.9.21 పెరిగిన పెట్రోల్ ధర
- వరుసగా 16వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెట్రోలుపై లీటరుకు 33 పైసలు పెరుగుదల
- డీజిల్‌పై లీటరుకు 58 పైసల పెంపు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.79.56
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 16వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 33 పైసలు, డీజిల్‌పై లీటరుకు 58 పైసలు పెరిగాయి. 16 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.9.21 , డీజిల్‌పై రూ.8.55 పెరగడం గమనార్హం.
ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.79.56కి, డీజిల్ ధర రూ.78.85కి చేరింది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.27, డీజిల్ ధర రూ.74.14 గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.86.36, డీజిల్ ధర రూ.77.24గా ఉండగా, చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.82.87, డీజిల్ ధర రూ.76.30గా ఉంది. రాష్ట్రాల పన్ను విధింపును బట్టి ఆయా రాష్ట్రాల్లో ధరల్లో తేడాలు ఉంటాయి.