వాహనాల రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదు?: జేసీ ప్రభాకర్‌రెడ్డి
- అనంతపురంలో పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్ రెడ్డి
- విచారణ పూర్తి.. మొత్తం 64 ప్రశ్నలు
- ప్రశ్నావళి అంతా తానొక్కడినే తప్పు చేసినట్లుగా ఉందని వ్యాఖ్య
అనంతపురంలో పోలీసుల కస్టడీలో ఉన్న టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల విచారణ పూర్తయింది. మొత్తం 64 ప్రశ్నలతో విచారించిన పోలీసులు సమాచార నివేదిక తయారు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించినట్టు తెలిసింది.
ప్రశ్నావళి అంతా తానొక్కడినే తప్పు చేసినట్లుగా ఉందని ఆయన చెప్పారు. మిగిలిన వారిని కూడా ప్రశ్నించి ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు. తాను ప్రతి వాహనాన్ని చెక్కుల ద్వారానే కొనుగోలు చేశానని అన్నారు. తాను కొనని వాహనాలను కూడా తానే కొన్నట్లుగా చెబుతున్నారని తెలిపారు. కాగా ఆయనకు కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అనంతపురం కోర్టుకు తీసుకెళతారు.