మే 20న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను చంపిన ఫరూక్‌ను హతమార్చిన సైన్యం

  • జమ్మూకశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు
  •  నలుగురు ఉగ్రవాదులు హతం
  • హతులందరూ హిజ్బుల్, ఐసిస్‌కు చెందిన వారే

జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌ల‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. మృతుల్లో ఒకరు షకూర్ ఫరూక్. మే 20న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను చంపిన కేసులో ఫరూక్ నిందితుడని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. అతడి నుంచి బీఎస్ఎఫ్ జవానుకు చెందిన రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాదిని షహీద్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

హతులందరూ హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారని పేర్కొన్నారు. కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తయాబ్ వలీద్ అలియాస్ ఇమ్రాన్ భాయ్, అలియాస్ గజీ బాబా హతమయ్యాడు. జైషే మొహమ్మద్ కమాండర్ అయిన అతడు పాకిస్థాన్‌కు చెందినవాడని, బాంబుల తయారీలో నైపుణ్యం ఉందని బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు.


More Telugu News