ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దు: ప్రధాని వ్యాఖ్యలపై కమలహాసన్ ఆగ్రహం
- ఘర్షణను అడ్డుపెట్టుకుని ఆటలా
- ప్రశ్నిస్తే దేశద్రోహం చేసినట్టేనా?
- ప్రజాస్వామ్య మూలమే ప్రశ్నించే హక్కన్న కమల్
లడఖ్ లోని గల్వాన్ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణను అడ్డుపెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రభుత్వ పెద్దలు ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తూ, ఆటలాడుతున్నారని మక్కల్ నీది మయ్యమ్ అధినేత, దక్షిణాది నటుడు కమలహాసన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన మోదీ, "మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ ఆక్రమించలేదు" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
వీటినే ప్రస్తావించిన కమల్, ఈ తరహా వ్యాఖ్యలతో ప్రజలను ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇటువంటి చర్యలను మోదీ, ఆయన మద్దతుదారులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే దేశద్రోహం చేసినట్లేనా? అసలు ప్రజాస్వామ్య మూలమే ప్రశ్నించే హక్కు’ అని కమల్ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ప్రధాని చేసిన ఇవే వ్యాఖ్యలను ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, 'అలాంటప్పుడు మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? వారిని ఎక్కడ చంపారు?' అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.