ఏడు విమానాల్లో శంషాబాద్‌లో ల్యాండ్ అయిన 1,084 మంది భారతీయులు
- చురుగ్గా సాగుతున్న వందేభారత్ మిషన్
- వివిధ దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న భారతీయులు
- వైద్య పరీక్షల అనంతరం క్వారంటైన్‌కు తరలింపు
లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు చేపట్టిన వందేభారత్ మిషన్ చురుగ్గా సాగుతోంది. రెండో దశ మిషన్‌లో భాగంగా నిన్న ఏడు విమానాల్లో 1,084 మంది భారతీయులు హైదరాబాద్ చేరుకున్నారు.
స్వీడన్‌లోని స్టాక్ హోమ్ నుంచి 163 మంది, న్యూజిలాండ్‌లోని ఆక్లామ్ నుంచి 115 మంది, నైజారియాలోని లాగోస్ నుంచి 168 మంది, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి 148 మంది, షికాగో నుంచి 125 మంది, మస్కట్ నుంచి 196 మంది, మలేసియా నుంచి 177 మంది వచ్చారు. వీరంతా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వైద్య పరీక్షలు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీల అనంతరం అందరినీ క్వారంటైన్‌కు తరలించారు.