కేంద్ర బలగాల రక్షణ కోరిన ఎంపీ రఘురామకృష్ణంరాజు
- లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన నరసాపురం ఎంపీ
- ప్రాణహాని ఉందన్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని వెల్లడి
- దిష్టిబొమ్మకు పట్టిన గతే పడుతుందని బెదిరిస్తున్నారని ఆవేదన
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, నియోజకవర్గంలోనూ తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని స్పీకర్ కు తెలియజేశారు. తనపై వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు స్పందించడంలేదని, అందుకే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు.
టీటీడీ భూముల అమ్మకం, ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు, ఇసుక అక్రమాలపై ప్రశ్నించానని తనపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, కొందరు తన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని వివరించారు. దిష్టిబొమ్మకు పట్టిన గతే పడుతుందని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, లోక్ సభ స్పీకర్ కు పంపిన లేఖనే రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి కూడా పంపినట్టు తెలుస్తోంది.