1962 యుద్ధ సమయంలోనూ చైనా వివరాలు చెప్పలేదు: వీకే సింగ్

  • 1962 యుద్ధంలో ఇరువైపులా 2,000 మంది మృతి చెందారు
  • చైనా మాత్రం 200 మాత్రమేనని చెప్పింది
  • ఇటీవలి ఘర్షణలో 600 మంది పాల్గొని ఉండొచ్చు
  • పరిస్థితులు భారత బలగాల నియంత్రణలోనే ఉన్నాయి
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో ఎంత మంది తమ సైనికులు మృతి చెందారన్న విషయాన్ని చైనా వెల్లడించలేదన్న విషయం తెలిసిందే. దీనిపై  కేంద్ర సహాయ  మంత్రి, మాజీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ వీకే‌ సింగ్‌ పలు విషయాలు తెలిపారు. 1962లో జరిగిన యుద్ధంలోనూ ఎంతమంది మృతి చెందారన్న విషయాన్ని చైనా తెలపలేదని అన్నారు. ఇరు దేశాల్లో కలిసి అప్పట్లో సుమారు 2,000 మంది సైనికులు మృతి చెందారని, కానీ, చైనా మాత్రం 200 మందే ప్రాణాలు కోల్పోయారని చెప్పిందని తెలిపారు.

ఇటీవల జరిగిన ఘర్షణలో మన ప్రభుత్వ లెక్కల ప్రకారం 43 మంది చైనా సైనికులు మృతి చెందారని వివరించారు. ఆ ఘర్షణలో సుమారు 600 మంది పాల్గొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.  చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం గాల్వన్‌లోయ వద్ద  పరిస్థితులు భారత బలగాల నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు.  చైనా సైనికుల  చొరబాట్లు లేవని వివరించారు.  గల్వాన్‌ లోయ తమదేనని చైనా  తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు.



More Telugu News