నా లేఖకు స్పందించి పది పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నా: కన్నా
- ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
- విద్యార్థుల శ్రేయస్సు కోరి తాను లేఖ రాశానన్న కన్నా
- ప్రజల కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందంటూ ట్వీట్
ఏపీలో అన్ని వైపుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో వైసీపీ సర్కారు పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. అటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి ఫెయిలైన వాళ్లందరినీ పాస్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
ఈ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. కరోనా విపత్తు కారణంగా రాష్ట్ర విద్యార్థుల శ్రేయస్సు, భద్రతను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. ఆ లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు.