అందుకే తొలుత బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశా: డేవిడ్ వార్నర్ వివరణ
- అభిమానులను అడిగాను
- వారి సూచనల ప్రకారమే డ్యాన్స్
- కరోనా వేళ అభిమానుల్లో చిరునవ్వు కోసమే డ్యాన్సు
- భారతీయ స్టెప్పులు కష్టం
భారతీయ సినిమాల పాటలకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య, పిల్లలతో కలిసి స్టెప్పులు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో చిరునవ్వులు పూయించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు ఆయన తాజాగా చెప్పాడు.
మన ఆలోచనలు పరిధిని మించి ఉండాలని చెప్పాడు. అందుకే తన కుటుంబసభ్యులతో కలిసి తాను ఆ వీడియోలు చేయగలిగానని చెప్పాడు. తాము మొదట అభిమానులతో ముచ్చటించి వారికేం కావాలో అడిగేవాళ్లమన్నాడు. అభిమానులు తమ అభిప్రాయాలు చెప్పేవారని, వారి సూచనల ప్రకారమే తాము మొదట 'బుట్టబొమ్మ' పాటకు డ్యాన్స్ చేశామని చెప్పాడు.
అనంతరం కూడా వరుసగా వీడియోలు చేశామని, అభిమానులు అడిగిన వాటికి డ్యాన్సులు చేశామని తెలిపాడు. ఇండియన్ స్టెప్పులు వేయడం చాలా కష్టమని, వాటిని చేయాలంటే చాలా శ్రద్ధ పెట్టాలని తెలిపాడు.