బై గైస్... నా ట్విట్టర్ ఖాతాను మూసేస్తున్నా: సోనాక్షీ సిన్హా
- బాలీవుడ్ తారలపై నెపోటిజం విమర్శలు
- సుశాంత్ మరణం తరువాత పెరిగిన నిందలు
- ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానన్న సోనాక్షి
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత బాలీవుడ్ లో నెపోటిజం హైలైట్ అవుతున్న వేళ, తాను ట్విట్టర్ ఖాతా నుంచి తప్పుకుంటున్నానని హీరోయిన్ సోనాక్షీ సిన్హా వెల్లడించింది. "నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే వేయాల్సిన తొలి అడుగు నెగటివిటీకి దూరంగా ఉండటమే. ముఖ్యంగా ఈ సమయంలో ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. ఛలో.. నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. బై గైస్... ఇక ప్రశాంతంగా ఉండండి " అని వ్యాఖ్యానించింది.
కాగా, సుశాంత్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడన్న విషయం ఇంతవరకూ వెలుగులోకి రాలేదు. నెపోటిజం (బంధుప్రీతి) ఉన్నప్పటికీ, అది ఒకటి, రెండు సినిమాలకు మాత్రమే పనికొస్తుందన్నది జగమెరిగిన సత్యం. అయినా, పలువురు బాలీవుడ్ నటీ నటులను, ముఖ్యంగా వారసత్వంగా సినీ పరిశ్రమకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనాక్షి ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. త్వరలో మరికొందరు నటీ నటులు కూడా సామాజిక మాధ్యమాలను వీడుతారని తెలుస్తోంది.