మూసుకుంటున్న దేశవ్యాప్త ఆలయాలు... తెరచుకుని ఉన్నది ఒకే ఒక్క ఆలయం!
- నేడు రాహుగ్రస్త సూర్యగ్రహణం
- శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఏర్పాట్లు చేసిన అధికారులు
నేడు దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడనుండటంతో, దేశవ్యాప్తంగా ఆలయాలు ఈ ఉదయం నుంచే మూతపడ్డాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరాలయం, శ్రీశైల మల్లికార్జున ఆలయం, ద్వారకా తిరుమల, పంచారామాలు, ఇంద్రకీలాద్రి, వేములవాడ, యాదగిరి నరసింహస్వామి తదితర ఆలయాలను అధికారులు ఇప్పటికే మూసివేశారు. నెల్లూరు తల్పగిరి ఆలయం, బాసర సరస్వతీ దేవి ఆలయం, అన్నవరం సత్యదేవుని ఆలయం, సింహాచలం శ్రీ వరాహస్వామి ఆలయం, అంతర్వేది లక్ష్మీ నరసింహుని ఆలయాలతో పాటు కాశీ, మధుర, అయోధ్య, సోమనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మూతపడ్డాయి.
ఇక ఇదే సమయంలో రాహు కేతు పూజలకు ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయం తెరచుకునే ఉంటుంది. ఆలయంలో నేడు ప్రత్యేక రాహుకేతు పూజలకు ఏర్పాట్లు చేశామని, గంటకు గరిష్ఠంగా 400 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని, సాయంత్రం 6 గంటల వరకూ రాహు కేతు పూజలను భక్తులు భౌతికదూరం పాటిస్తూ నిర్వహించేందుకు వీలు కల్పించామని ఈఓ పేర్కొన్నారు.