నేడు సూర్యగ్రహణం... ఏపీ, తెలంగాణల్లో సమయాలివే!
- ఇండియాలో కనువిందు చేయనున్న రింగ్ ఆఫ్ ఫైర్
- తెలుగు రాష్ట్రాల్లో 51 శాతం గ్రహణమే
- వెల్లడించిన ప్లానెటరీ ఆఫ్ ఇండియా
నేడు సూర్యగ్రహణం. ఇది ఇండియాలో కనువిందు చేయనుంది. భూమికి, సూర్యుడికీ మధ్య చంద్రుడు 70 శాతం కప్పివేయనుండటంతో, ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించనుంది. ఈ గ్రహణం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఉదయం గం. 9.15 నుంచి మొదలై, మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. ఆపై మధ్యాహ్నం 3 గంటలకు గ్రహణం ముగుస్తుంది.
కాగా, ప్రాంతాలను బట్టి, ఈ గ్రహణ సమయాల్లో మార్పులు ఉంటాయి. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకూ గ్రహణం ఏర్పడనుండగా, ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.44 వరకూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 51 శాతం గ్రహణమే కనిపించనుంది. హైదరాబాద్ విషయానికి వస్తే, కేవలం పాక్షిక గ్రహణమే కనిపించనుంది. ఇక, ఈ సమయంలో పడే అతినీలలోహిత కిరణాలతో 0.001 శాతం కరోనా వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇదిలావుండగా, ఈ సంవత్సరం డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇండియాలోని గుజరాత్ లో నేటి గ్రహణం తొలిసారిగా కనిపిస్తుందని, అసోంలోని దిబ్రూగఢ్ లో మధ్యాహ్నం ముగుస్తుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి రఘునందన్ వెల్లడించారు. రింగ్ ఆఫ్ ఫైర్ ను రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ వాసులు చూడవచ్చు. ఈ గ్రహణాన్ని నేరుగా చూడరాదని, రక్షణ జాగ్రత్తలు పాటిస్తూ చూడవచ్చని సలహా ఇచ్చారు.